Mon Dec 23 2024 06:58:59 GMT+0000 (Coordinated Universal Time)
Vidadala Rajini : విడదల రజనీ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
మాజీమంత్రి విడదల రజినీ అక్రమాలపై స్టోన్ క్రషర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది
మాజీమంత్రి విడదల రజినీ అక్రమాలపై స్టోన్ క్రషర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడదల రజినీ అక్రమాలకు పాల్పడ్డారని హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. పల్నాడు క్రషర్ యాజమాన్యం నుందచి పెద్దయెత్తున ముడుపులు, వసూళ్లకు పాల్పడ్డారంటూ విడుదల రజనీపై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.
ముడుపుల ఆరోపణలు...
మాజీ మంత్రి విడదల రజినీ అక్రమాలపై విచారణకు హోంమంత్రి అనిత ఆదేశించారు. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి 2.50 కోట్ల రూపాయల వసూలు చేసినట్లు ఆరోపణలు ఉండటంతో లోతుగా దర్యాప్తు చేయాలని హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు. విడదల రజినీ తో పాటుఅప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజినీ పీఏ గోపిపై స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
Next Story