Mon Nov 04 2024 18:37:11 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు సార్లు గెలిచినా మంత్రి పదవి దక్కలేదు.. ఒక్కసారి గెలిచి కేబినెట్ లో కి వచ్చేశారు
కడప జిల్లా రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేశారు
కడప జిల్లా రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాయచోటి వైసీపీ అభ్యర్థి గడికోటి శ్రీకాంత్ రెడ్డి పై పోటీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రెండు వేల ఓట్ల ఆధిక్యతతతో గెలుపొందారు. అయితే చంద్రబాబు కేబినెట్ లో మాత్రం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్థానం దక్కించుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి.
తొలిసారి ఎన్నికయి...
ఎందుకంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 లో ఎన్నికయినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. 2012లో వైసీపీకి మారి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో శ్రీకాంత్ రెడ్డి గెలిచినా వైసీపీ అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికల్లో గెలిచినా జగన్ తన కేబినెట్ లో స్థానం కల్పించలేదు. అదే రాయచోటి నుంచి తొలిసారి గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాత్రం అవకాశం కల్పించడం విశేషంగానే చెప్పుకోవచ్చు.
Next Story