Mon Dec 23 2024 09:01:25 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలో చేరిన టీడీపీ నేత
మంగళగరి నాయకుడు గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు.
మంగళగరి నాయకుడు గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. గంజి చిరంజీవి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన ఇటీవల టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఆయన వైసీపీలో చేరారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని గంజి చిరంజీవి అన్నారు.
బీసీలకు అన్యాయం...
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనమంతరావుతో కలసి జగన్ వద్దకు గంజి చిరంజీవి వచ్చారు. టీడీపీలో పెత్తనమంతా ఒక సామాజికవర్గానిదేనని చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు. అందుకే తాను టీడీపీని వీడి వైసీపీలో చేరానని తెలిపారు. టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, వారికి స్థానం లేకుండా చేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.
Next Story