Mon Dec 23 2024 08:03:40 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల వెంట నడుస్తా: ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన
ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతోనే నా రాజకీయ ప్రయాణం అని స్పష్టం చేశారు.. వైఎస్ షర్మిల రాజకీయాలపై తన నిర్ణయం ప్రకటించాక ఆమె వెంటే నడుస్తానని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన నియజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చంద్రబాబు, లోకేష్‌పై కేసులు వేస్తానన్న ఆయన.. చంద్రబాబు లాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఏవైనా తప్పులు చేస్తే అవసరమైతే వారిపై కూడా కేసులు వేస్తానన్నారు.
ఎవరు గెలవాలనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు ఆర్కే.నేను ఏ పార్టీలో చేరిన ఆరోజు నా నిర్ణయం చెప్తానని తెలిపారు. ఉంటే వైసీపీలో ఉంటాను అని చెప్పా ఇప్పుడు వైసీపీ వీడానన్నారు. నేను చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా మంది నన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నేను వైఎస్ కుటుంబంతో ఉన్నాను.. ఉంటానని చెప్పా.. అని తెలిపారు. వైసీపీకి నేను ఎంతో సేవచేశాను.. కానీ, నన్ను వైఎస్ జగన్ గుర్తించలేదన్నారు. మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరం ఇలాంటి నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలంటే.. ఆ నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధి చేయాలో అంత స్థాయిలో చేయలేదన్నారు. మరి ప్రజలు ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. మంగళగిరిలో కోట్లు అప్పులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజీనామా చేసినా ఇంకా ఆమోదం లభించలేదు.
Next Story