Mon Dec 23 2024 15:53:53 GMT+0000 (Coordinated Universal Time)
గంజాయి కేసులో అరెస్టైన జాహ్నవిని సస్పెండ్ చేసిన టిడిపి
జాహ్నవి అరెస్ట్ తో టిడిపి కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిడిపి క్రమశిక్షణా సంఘం..
అమరావతి : టిడిపి మహిళా నాయకురాలు మానుకొండ జాహ్నవిని నిన్న తెలంగాణ పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జాహ్నవి అరెస్ట్ తో టిడిపి కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిడిపి క్రమశిక్షణా సంఘం చైర్మన్ బచ్చుల అర్జునుడు ప్రకటించారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిడిపి చేరిన మానుకొండ జాహ్నవిని చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన అధికారికంగా తెలిపారు. 2013 గంజాయి కేసులో అరెస్టైన జాహ్నవిపై.. కేసు తుదితీర్పు వచ్చేంతవరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
గంజాయి స్మగ్లింగ్ కేసులో ఏపీ టిడిపి మహిళా నేత జాహ్నవిని ఆదివారం తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన జాహ్నవిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. 2013లో నమోదైన గంజాయి స్మగ్లింగ్ కేసులో జాహ్నవి హస్తం ఉందని గుర్తించారు సైబరాబాద్ పోలీసులు. గంజాయి తరలింపు లో NDPC Act లో నలుగురిపై కేసు నమోదవ్వగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడైన మరో వ్యక్తి శ్రీనివాస్ పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు.
Next Story