Mon Dec 23 2024 16:08:10 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu Oath : చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అందరూ ఎందరో
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అతిధులు ఎందరో వచ్చారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా వచ్చారు
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అతిధులు ఎందరో వచ్చారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ లు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. వీరితో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాధ్ షిండేతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కేంద్ర మంత్రులు...
వీరితో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రత్యేక ఆహ్వానితులుగా అనేక మంది తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వీరితో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్ కూడా హాజరయి సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Next Story