Sun Dec 15 2024 14:46:16 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాలు తప్పిన గూడ్స్... రైళ్ల రాకపోకలకు అంతరాయం
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ మార్గంలో అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ మార్గంలో అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఖమ్మం నుంచి విజయవాడ వెళుతుండగా ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెద్ద శబ్దం రావడంతో పైలట్ రైలును నిలిపేశారు. రెండు బోగీలు ట్రాక్ నుంచి పక్కకు ఒరిగిపోయాయి.
అనేక రైళ్లను....
దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళుతున్న అనేక రైళ్లను అధికారులు నిలిపేశారు. వెంటనే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. పట్టాలు తప్పిన రైలు బోగీలను సరి చేస్తున్నారు. సాంకేతిక కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధకారులు ప్రాధమికంగా నిర్ణయించారు. పట్టాలు తప్పడంతో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story