Mon Dec 23 2024 02:48:24 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్.. మన్యం విడిచి వెళ్లిపోవాలంటూ?
వైసీపీ ఎమ్మెల్యేకు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. మన్యం విడిచి వెళ్లిపోవాలంటూ ఒక లేఖను మావోయిస్టులు విడుదల చేశారు
వైసీపీ ఎమ్మెల్యేకు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. మన్యం విడిచి వెళ్లిపోవాలంటూ ఒక లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ని మావోయిస్టులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే మన్యం విడిచి వెళ్లిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మావోలు హెచ్చరికలు జారీ చేశారు.
భద్రతను మరింత...
దీంతో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి భద్రతను మరింత పెంచారు. ఇదే కారణంపై గతంలో అరకు ఎమ్మెల్యే గా ఉన్న కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరు ప్రాంతంలో పోలీసు పహారాను పెంచారు. ఎమ్మెల్యే తమకు చెప్పకుండా పాడేరు ప్రాంతంలో పర్యటించరాదని పోలీసులు చెప్పారు.
Next Story