Mon Dec 23 2024 05:45:42 GMT+0000 (Coordinated Universal Time)
ఘనంగా పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. ఆఖరికి వివాహిత అనుమానాస్పద మృతి
కన్నబిడ్డలు, తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా వివాహిత చేసిన పని.. కడుపు శోకాన్ని మిగిల్చింది. పిల్లలను తల్లిలేని అనాదలను
పెళ్లి.. జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే పండుగ. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ.. ఈ కాలంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న జంటలు నూరేళ్లు కాదు కదా.. నూరుమాసాలు కూడా సజావుగా ఉండలేకపోతున్నారు. పెళ్లికి ముందు కలలు కన్న జీవితం.. పెళ్లి తర్వాత పూర్తి భిన్నంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నారు. కారణాలేవైనా కావచ్చు.. సమస్యలేవైనా రావచ్చు.. వాటిని పరిష్కరించుకోకుండా జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. కన్నబిడ్డలు, తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా వివాహిత చేసిన పని.. కడుపు శోకాన్ని మిగిల్చింది. పిల్లలను తల్లిలేని అనాదలను చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం నేసేపేటకు చెందిన వెంకటకృష్ణకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె సుజనకు ఆరేళ్ల క్రితం వివాహమయింది. పెళ్లి సమయంలో రూ.18లక్షల క్యాష్, 30 తులలా బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. వెంకటకృష్ణ తాడిమర్రిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరేళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ.. సుజన మాత్రం పెళ్లి తర్వాత సంతోషంగా లేదు. ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఎవరికీ చెప్పకుండానే జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది. వారుంటున్న ఇంట్లోని థర్డ్ ఫ్లోర్ కి వెళ్లిన సుజన ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది.
మర్నాడు ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమార్తె మరణవార్త విన్న తల్లిదండ్రులు.. తమ కుమార్తెను అదనపు కట్నం కోసం అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story