Sun Dec 22 2024 19:12:25 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో దంచి కొడుతున్న ఎండలు.. వామ్మో ఇంత స్థాయిలోనా?
ఆంధ్రప్రదేశ్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదునమోదవుతున్నాయి. ఏప్రిల్లో 46 డిగ్రీలు నమోదుఅవడంతో ప్రజలు భయపడిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదునమోదవుతున్నాయి. ఏప్రిల్లో 46 డిగ్రీలు నమోదుఅవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్టంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడగాలుల తీవ్రత కూడా...
బుధవారం 34 మండలాల్లో తీవ్ర వడగాలులు, 216 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వడదెబ్బకు గురవుతారని, అందుకే సాయంత్రం నాలగు గంటల వరకూ ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Next Story