Mon Dec 23 2024 04:06:53 GMT+0000 (Coordinated Universal Time)
శనివారం రద్దీ ఎలా ఉందంటే ?
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. నిన్న క్యూకాంప్లెక్స్ భక్తులతో నిండిపోగా.. నేడు కాంప్లెక్స్ వెలుపలికి క్యూలైన్లు పెరిగాయి. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. కాగా.. నిన్న 79,486 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
40,250 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ తెలిపింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ తగు చర్యలు చేపట్టింది. సిఫార్సు లేఖల ద్వారా దర్శనానికి వచ్చేవారిని అనుమతించబోమని తెలిపింది. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా త్రాగునీరు, అన్నప్రసాదాలను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.
Next Story