Sun Dec 22 2024 13:56:42 GMT+0000 (Coordinated Universal Time)
ఆరోగ్య శ్రీపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఆరోగ్య శ్రీపై తప్పుడు ప్రచారం తగదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు
ఆరోగ్య శ్రీపై తప్పుడు ప్రచారం తగదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్య శ్రీని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలు బకాయీలు పెట్టారని, వాటిని చెల్లించాలని కార్పొరేట్ ఆసుపత్రులు వత్తిడి తెస్తున్నాయని తెలిపారు. అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ఆరు వేల కోట్ల బిల్లులు...
వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బిల్లులను పెండింగ్ లో పెట్టిందని, బిల్లులు చెల్లిద్దామంటే ఖజానా లో నిధులు లేకుండా ఖాళీ చేశారన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా మాయమాటలు చెప్పి కాలక్షేపం చేయబోమని తెలిపారు. ఆరోగ్య శ్రీ విధానాన్ని ఎలా అమలు పర్చాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రజారోగ్యం కోసం ఈ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుందని సత్యకుమార్ తెలిపారు.
Next Story