Mon Dec 23 2024 10:11:44 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ అనంతబాబుకు వైద్య పరీక్షలు పూర్తి
జీజీహెచ్లో ఎమ్మెల్సీ అనంతబాబుకు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి.
జీజీహెచ్లో ఎమ్మెల్సీ అనంతబాబుకు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. దీంతో ఆయనను పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారు. సుబ్రహ్మణ్యాన్ని తాను చంపినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ ను తానే హత్య చేసినట్టు అనంతబాబు ఒప్పుకున్నారు. వ్యక్తిగత విషయాల్లోె జోక్యం చేసుకున్నందుకే చంపానని చెప్పారు. నా వ్యక్తిగత విషయాలు అందరికి చెబుతానని సుబ్రమణ్యం బ్లాక్ మెయిల్ చేశాడని అనంతబాబు పోలీసులతో చెప్పుకొచ్చారు. సుబ్రమణ్యంను హత్య చేయాలనుకోలేదని.. కొట్టి బెదిరిద్దామనుకున్నానని అనంతబాబు తెలిపారు. కాకినాడలో మే 19న కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకు గురయ్యాడు.
వైద్య పరీక్షలు పూర్తి కావడంతో అనంతబాబును కాసేపట్లో జడ్జి ముందు హాజరుపర్చే అవకాశం ఉంది. అనంతబాబును పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. అనంతబాబును పోలీసులు కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం కోర్టు సమయం ముగియడంతో నిందితుడిని జడ్జి ఇంటికి తీసుకువెళ్లనున్నారు. ఇప్పటికే మండలి చైర్మన్తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా సమాచారం అందజేశారు. ఎస్పీ ఆఫీస్ నుంచి అనంతబాబును జడ్జి నివాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. భారీ బందోబస్తు మధ్య అనంతబాబును పోలీసులు తరలించనున్నారు.
News Summary - mlc anantha babu medical tests completed in kakinada ggh
Next Story