Mon Dec 23 2024 09:57:56 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు శాసనసభ పక్ష నేత ఎంపిక
ఈరోజు విజయవాడలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుంది. శాసనసభ పక్ష నేత ఎంపిక జరుగుతుంది
ఈరోజు విజయవాడలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుంది. ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నారా చంద్రబాబు నాయుడును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించనున్నారు.
గవర్నర్ కు పంపి...
ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం ఆ తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలం ఉండటంతో ఈరోజు సాయంత్రానికి చంద్రబాబును ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించనున్నారు. రేపు ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు నేతలు హాజరవుతున్నారు.
Next Story