Mon Dec 23 2024 15:52:41 GMT+0000 (Coordinated Universal Time)
Tdp, Janasena : సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం
విజయవాడలో తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమయింది
విజయవాడలో తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమయింది. విజయవాడ నోవాటెల్లో ప్రారంభమయిన ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు వంటి వారు హాజరయ్యారు.
ఉమ్మడి మేనిఫేస్టో....
జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేష్ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఉమ్మడి మ్యానిఫేస్టో తో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఒకసారి రాజమండ్రిలో సమావేశమై చర్చించారు. తర్వాత జిల్లాల వారీగా సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ మాత్రం హాజరు కాలేదు. ఉమ్మడి మ్యానిఫేస్టో పైనే ప్రధానంగా చర్చించే అవకాశముంది.
Next Story