Mon Dec 23 2024 15:51:26 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వైసీపీ కాపు నేతల సమావేశం
వైసీపీ కాపు నేతల సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. జనసేన అధినేత వ్యాఖ్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది
వైసీపీ కాపు నేతల సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. జనసేన అధినేత వ్యాఖ్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. కాపు ఎమ్మెల్యేలు, నేతలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారని తెలిసింది. కాపు సామాజికవర్గమంతా తన వెంటే ఉందని, కొందరు కాపు నేతలు జగన్ కు అమ్ముడుపోయారన్న పవన్ వ్యాఖ్యలను ఈ సమావేశంలో ఖండించనున్నారు.
పవన్ ను అడ్డుకోవడం....
దీంతో పాటు వైసీపీకి కాపు యువతను ఆకట్టుకోవడంపై ఈ సమావేశంలో వ్యూహరచన చేయనున్నారు. చంద్రబాబుకు పవన్ తన పార్టీని తాకట్టు పెడుతున్నారన్న ప్రచారాన్ని విస్తృతం చేయాలన్నది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ లక్ష్యంగానే ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని తెలిసింది.
- Tags
- kapu leaders
- ycp
Next Story