Thu Dec 19 2024 00:05:58 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు రీజనల్ కో-ఆర్డినేటర్లతో జగన్ భేటీ
వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో నేడు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.
వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో నేడు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో ఈ సమావేశంలో జగన్ రానున్న ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలన్న దానిపై రీజినల్ కో ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఎన్నికల ప్రచారంపై...
ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 20వ తేదీన మ్యానిఫేస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఈరోజు జరిగే సమావేశంలో ఎలక్షనీరింగ్ పై కూడా రీజినల్ కోఆర్డినేటర్లకు మార్గదర్శనం చేయనున్నారు.
Next Story