Sat Apr 12 2025 14:48:09 GMT+0000 (Coordinated Universal Time)
మనసు ఎలా అంగీకరించింది బ్రదర్.. నాగబాబు సూటి ప్రశ్న
మెగా బ్రదర్ నాగబాబు తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. హిందూ మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమని అన్నారు

మెగా బ్రదర్ నాగబాబు తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. హిందూ మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమని అన్నారు. ఆయన ఎక్స్ లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. తిరుమల ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని నాగబాబు వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూపై...
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారని, జంతు కొవ్వును అందులో వేయడానికి వెనుకాడని నేరగాళ్లను క్షమించకూడదని నాగబాబు కోరారు. దీనిపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి నిందితులు ఎవరైనా వారిని చట్ట ప్రకారం శిక్షించాలని నాగబాబు కోరారు. కోట్లాది మంది ఇష్టపడి తినే లడ్డూలో ఇలాంటి పాడు పనిచేయడానికి మనసు ఎలా ఒప్పిందంటూ ఆయన ప్రశ్నించారు.
Next Story