Sun Dec 22 2024 23:53:56 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవి జనసేనలో చేరవచ్చు
చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబుతో ఓపెన్ డిబేట్ నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని
గత కొద్దిరోజులుగా మెగా హీరోలు వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్లు వివాదం నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా దగ్గర మొదలైన వివాదం.. ఆ తర్వాత భోళా శంకర్ సినిమా విషయంలో కూడా జరిగింది. ఇక ఏ విషయంలో అయినా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందిస్తూ ఉంటారు. అయితే ఈ గొడవలపై కూడా ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.
కేఏ పాల్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని అన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేస్తున్నారని.. ఇన్కం ట్యాక్స్ ఎగ్గొట్టడానికే బీజేపీతో జనసేన పార్టీ పొత్తు అని కేఏ పాల్ అన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు గుండు గీస్తానని పాల్ అన్నారు. బీజేపీ-బి పార్టీలను ఓడిస్తానని.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ప్రజలను నమ్మొద్దన్నారు పాల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది వారాహి యాత్ర కాదని.. మోదీ యాత్ర అని కేఏ పాల్ విమర్శించారు. చిరంజీవి కూడా జనసేనలో చేరుతారని లీక్స్ ఇస్తున్నారని.. సిగ్గున్న వారు ఎవరైనా జనసేన పార్టీలో చేరతారా అని పాల్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ విశాఖలో చేస్తున్నది వారాహి యాత్ర కాదని, బీజేపీ కోసమేనని అన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబుతో ఓపెన్ డిబేట్ నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేఏ పాల్ సవాల్ విసిరారు. 2024 తర్వాత జనసేన బీజేపీలో విలీనం కావడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోస్యం చెప్పారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి 5 వేల కోట్లు తీసుకున్నారన్నారు.
Next Story