Wed Dec 25 2024 09:09:13 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : పిఠాపురానికి నేను ఎందుకు వెళ్లడం లేదంటే?
తాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేనని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
తాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేనని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తన తమ్ముడు గెలవాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు. పద్మవిభూషణ్ అవార్డును తీసుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న చిరంజీవి ఏపీ రాజకీయాలపై స్పందించారు. తాను పిఠాపురం వెళ్లడం లేదని తెలిపారు. తను ప్రచారానికి రావాలని నా తమ్ముడి ఎప్పుడూ కోరుకోలేదని చిరంజీవి అన్నారు.
ఏ రాజకీయ పార్టీలో లేను...
తాను రాజకీయాలకి అతీతంగా ఉండాలి అనుకుంటున్నానని చిరంజీవి అన్నారు. తాను పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతున్నట్లు మీడియానే ప్రచారం చేసిందన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని చిరంజీవి తెలిపారు. కళ్యాణ్ బాబు తనను ప్రచారానికి రమ్మని ఎప్పుడూ కోరుకోలేదని, తనకు ఆ స్వేచ్చకు వదిలేస్తాడని చిరంజీవి అన్నారు.
Next Story