Wed Jan 15 2025 19:37:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆ పదవి నుంచి తప్పుకుంటా
కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటానని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు
కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటానని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. త్వరలోనే ఈ మేరకు వైసీపీ హైకమాండ్ కు లేఖ పంపుతానని ఆమె చెప్పారు. పత్తిపాడు నియోజకవర్గానికే తాను పరిమితం కావాలనుకుంటున్నానని ఆమె అన్నారు. త్వరలోనే జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానని సుచరిత మీడియాకు తెలిపారు.
అయ్యన్నను అప్పుడే...
ఐఏఎస్, ఐపీఎస్ లను కాలుతో తంతానని అన్నప్పుడే అయ్యన్నపాత్రుడిని లోపల వెయ్యాల్సిందని సుచరిత అభిప్రాయపడ్డారు. అయ్యన్నను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగిందన్నారు. పవన్ కల్యాణ్ ఏ పాత్ర చేపట్టినా ప్రజలు ఆదరించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. తమది పేదల ప్రభుత్వమని, అన్ని వర్గాలకు అండగా నిలిచే సర్కార్ అని ఆమె అన్నారు.
Next Story