Mon Dec 23 2024 08:15:36 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో కూర్చుని ట్వీట్లా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిన ట్వీట్లనే పవన్ పోస్టులు చేస్తున్నారన్నారు. విశాఖ మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందో తెలిసి పోతుందని మార్గాని భరత్ తెలిపారు. ట్వీట్లు చేయడం తప్ప పవన్ కు మరో పనిలేదనిపిస్తుందన్నారు. హైదరాబాద్ లో కూర్చుని వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేస్తే ప్రజలు ఊరుకోరని, 2019 ఎన్నికల ఫలితాలను గుర్తు పెట్టుకోవాలని మార్గాని భరత్ తెలిపారు.
ఒక సామాజికవర్గం వారికే...
అమరావతిలో ఒక సామాజికవర్గం బాగుపడాలని టీడీపీ కోరుకుంటుందన్నారు. రాష్ట్రం మొత్తం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులను 29 గ్రామాల్లో ఒకే సామాజికవర్గాలకు పెట్టాలంటే ఎలా కుదురుతుందన్నారు. అమరావతిలో భూములు ఉన్నవారంతా హైదరాబాద్ లోనే నివాసం ఉండి ఇక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని మార్గాని భరత్ తెలిపారు. మిగిలిన ప్రాంతాలు బాగుపడక్కర్లేదా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని చెప్పినా యాత్రల పేరుతో ఇతర ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హైదరాబాద్ లో ఉండి అమరావతిని రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తుండటం సిగ్గు చేటని మార్గాని భరత్ అన్నారు.
Next Story