Sun Mar 30 2025 10:30:54 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లోనే రఘురామకృష్ణరాజు
పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు తన భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నారు

పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు తన భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నారు. తన అనుచరులతో కలసి రైలులో ప్రయాణిస్తున్న ఆయన బేగంపేట రైల్వే స్టేషన్ లో దిగిపోయారు. తన నరసాపురం నియోజకవర్గమైన భీమవరంలో అల్లూరి సీతారామరాజు ఆవిష్కరణ సభకు రఘురామకృష్ణరాజు తన అనుచరులతో కలసి రైలులో బయలు దేరారు. అయితే తమను పోలీసులు వెంబడిస్తున్నారని అనుమానించి మధ్యలోనే దిగిపోయారు. తన భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నారు
మధ్యలోనే దిగిపోయి....
నిన్న రాత్రి లింగంపల్లి నుంచి నరసాపురం ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన రఘురామకృష్ణరాజు బేగంపేటలోనే దిగి వెళ్లిపోయారు. ఆయన తన నియోజకవర్గానికి ప్రధాని మోదీ వస్తుండటంతో ఆ కార్యక్రమానికి హాజరుకావాలని శతవిధాలుగా ప్రయత్నించారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. తనకు ప్రత్యేక రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. హెలికాప్టర్ దిగేందుకు అనుమతించాలని కూడా కోరారు. కానీ చివరకు రైలులో బయలుదేరిన రఘురామకృష్ణరాజు మధ్యలోనే దిగిపోయారు. తన అనుచరుల కోసం భీమవరం పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
Next Story