Mon Dec 23 2024 06:34:31 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ నే గెలిపించండి.. అప్పుడే పథకాల అమలు
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ పార్టీని గెలిపించాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు.
సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, బీసీలకు ప్రాధాన్యత దక్కాలన్నా జగన్ పార్టీని గెలిపించాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు. జగన్ తరహాలో దేశంలో ఎక్కడా ఇన్ని పథకాలు అమలు కాలేదని ఆయన అన్నారు. బీసీలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చింది కూడా జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలను మెచ్చుకుంటున్నారని ఆర్.కృష్టయ్య అన్నారు. బీసీలకు అండగా నిలిచిన జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం బీసీలుగా మనందరిపైనా ఉందని ఆయన అన్నారు. జగన్ విలువ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పథకాలను పరిశీలిస్తేనే అర్థమవుతుందన్నారు.
పేదలు బాగుపడాలంటే...
పేద ప్రజల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం నుంచి పేదల కుటుంబాలకు నేరుగా నగదును పంపిణీ చేసి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఘనత జగన్ దేనని అన్నారు. జగన్ వేసిన పునాదులను సద్వినియోగం చేసుకుని మరింత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మెరుగైన విద్య అందితే బీసీలతో పాటు ఎస్సి, ఎస్టీ, మైనారిటీలు ఉన్నత శిఖరాలు చేరుకుంటారని ఆయన అన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడానికి కృషి చేసింది జగన్ అని ఆయన అన్నారు. ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే మరిన్ని పథకాలు వస్తాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ ను గెలిపించాలని ఆర్.కృష్ణయ్య కోరారు.
Next Story