Mon Dec 23 2024 09:39:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీ కార్యక్రమాలను పదే పదే అడ్డుకుంటున్నారు, దీంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు
తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీ కార్యక్రమాలను పదే పదే అడ్డుకుంటున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని వారు పెద్దయెత్తున నినాదాలు చేస్తున్నారు. విజిల్స్ ఊదుతూ సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పైకి పేపర్లు చించి విసిరేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు.
ఒకరోజు పాటు...
దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీడీపీ సభ్యులకు, మార్షల్స్ కు మధ్య వాగ్వాదం జరుగుతుంది.
Next Story