Sun Dec 22 2024 20:58:50 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : ఏపీలో నేడు వర్షాలు కురిసే ప్రాంతాలివే
నేడు ఆంధ్రప్రదేశ్ లో వర్షం కురిసే ప్రాంతాలను వాతావరణ శాఖ ప్రకటించింది.
నేడు ఆంధ్రప్రదేశ్ లో వర్షం కురిసే ప్రాంతాలను వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య & ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధ సగటు సముద్రం నుండి 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల అవర్తనం విస్తరించి ఉంది. అల్పపీడనం వచ్చే 24 గంటలలో పశ్చిమం వైపు కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లగడించారు.
ఈ ప్రభావంతో...
ఈ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఊరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశందని వాతావరణ శాఖ పేర్కొంది.
Next Story