Sun Dec 14 2025 23:25:41 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. రుతుపవనాలు వచ్చేశాయ్
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయని తెలిపింది

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయని తెలిపింది. రాయల సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది.
కొన్ని చోట్ల తేలికపాటి...
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. తొలుత జూన్ 4 లేదా ఐదు తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలకు మండిపోతున్న ప్రజలకు ఇది ఊరట కల్గించే వార్త అని చూడాలి.
Next Story

