Sun Dec 22 2024 20:51:42 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report Today : నేడు ఏపీలో వర్షం కురిసే ప్రాంతాలివేనట
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో వరసగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఎఫెక్ట్లతో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడా ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే భారీ వర్షాలు ఎక్కడా పడే అవకాశం లేదని, మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
చలిగాలులతో ఉన్న...
అసలే చలి గాలులతో ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రజలకు వర్షాలు పడుతుండటంతో కొంత ఇబ్బందికరంగా మారింది. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ప్రజలు ఎక్కువ మంది అనారోగ్యం పాలయి ఆసుపత్రులు పాలవుతున్నారు. వర్షాలతో వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయని, ముఖ్యంగా జ్వరం, ఒళ్లునొప్పులు, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలతో ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులు లేకపోయినా అనారోగ్యంతో ఇబ్బంది పడే వారి సంఖ్య అధికంగా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
నేడు ఈ జిల్లాల్లో...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్రలో ఒక మోస్తరు వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే పగటి పూట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణకంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశముందని కూడా తెలిపింది. అనేకచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని కూడా తెలిపింది. అయితే సాయంత్రానికి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం మరో మూడు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story