Wed Mar 26 2025 16:54:03 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ లో నేడు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి జల్లులు కురిసినా ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపిదంి.
తీరం వెంట...
తీరంవెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.
Next Story