Thu Jan 09 2025 02:48:46 GMT+0000 (Coordinated Universal Time)
Flash Floods : ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటో తెలుసా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ లో ఫెంగల్ తుపాను కారణంగా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరించారు
ఆంధ్రప్రదేశ్ లో ఫెంగల్ తుపాను కారణంగా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో ఫాష్ ఫ్లడ్ వచ్చే అవకాశముందని తెలిపింది. దీంతో ఈ నాలుగు జిల్లాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ ను అధికారులు ప్రకటించారు. రెడ్ అలెర్ట్ అంటేనే అతి భారీ వర్షాలు కురిసే సమయంలోనే జారీ చేస్తుంటారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే ఇలాంటి అలెర్ట్ లను అధికారులు జారీ చేస్తుంటారు. నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశముందని చెప్పడంతో ఈ నాలుగు జిల్లాల ప్రజలు బితుకు బితుకుమంటూ భయపడిపోతున్నారు. ఫెంగల్ తుపాను ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనన్నఆందోళన వ్యక్త మవుతుంది.
కుండపోత వర్షాలతో...
ఇప్పటికే ఫెంగల్ తుపాను కారణంగా ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేశారు. అయితే అసలు ప్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి? అవి ఎలా సంభవిస్తాయన్న అనుమానం చాలా మందిలో ఉంది. అయితే ఒక్కసారిగా కురిసినభారీ వర్షాలతో వాగులు, నదులు, వంకలు ఉప్పొంగుతాయి. కొద్ది నిమిషాలు లేకుంటే కొద్ది గంటల్లోనే అలజడి రేపుతాయి. సాధారణ వర్షాలు కురిసినప్పుడు అది భూమిలో ఇంకిపోతుంది. కానీ భారీ వర్షాలతో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రం భూమిలో నీరు ఇంకకుండా నివాస ప్రాంతాలపై పడే అవకాశముంటుంది. కంటిన్యూగా వర్షాలు పడటం కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి.
నదుల్లో నీటి నిల్వ స్థాయి...
ఈ కారణంగా నదుల్లో నీటి నిల్వ స్థాయి పెరుగుతుంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇళ్లను ఖాళీ చేసి ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లాలి. రాత్రి వేళ ఆకస్మిక వరదలు వస్తే తప్పించుకోవడం కష్టం. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అదేసమయంలో నదులు, వాగులు వంకల వద్ద జాగ్రత్తగా ఉండాలి. వీలయినంత వరకూ వృద్ధులు, పిల్లలు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన సమయంలో ఎవరూ బయటకు రాకపోవడమే మంచిదన్న సూచనలు వినిపించాయి. అసాధరణంగా వర్షాలు పడతాయని, ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురియడం వల్ల ముంపు సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫెంగల్ తుపాను కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
Next Story