Sun Dec 22 2024 18:04:59 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : "దానా" ముప్పు ఏపీని తాకనుందా? ఏ మేరకు డ్యామేజ్ చేస్తుంది?
తుపాను తీవ్రతకు ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
తుపాను తరుముకొస్తుంది. ఉత్తర అండమాన్ సముద్రంలోనూ, బంగాళాఖాతంలోనూ అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి ఆ తర్వాత తుపానుగా తీవ్ర రూపం దాల్చనుంది. అయితే ఒడిశా - పశ్చిమ బెంగాల్ మధ్య తుపాను తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలకు కొంత ముప్పు తప్పినట్లేనని భావించినప్పటికీ బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతవారణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని సూచించింది. ఇప్పటికే విశాఖ జిల్లాలో దాదాపు పథ్నాలుగు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్లు,,,
కంట్రోల్ రూమ్లు 24 గంటల పాటు పనిచేసే విధంగా సిబ్బందిని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. తుపాను బీభత్సం అంతగా ఉండకపోవచ్చని ఒకవైపు చెబుతున్నప్పటికీ ముందస్తు చర్యలను మాత్రం అధికారులు తీసుకుంటున్నారు. మత్స్యకారుల చేపల వేటను పూర్తిగా నిషేధించారు. ఈ నెల 26వ తేదీ వరకూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు ఏ క్షణమైనా పునరావాస కేంద్రాలకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ప్రకటనలు చేస్తున్నారు. భారీ వర్షాలు పడితే విద్యాసంస్థలకు కూడా సెలవులను ప్రకటించే యోచనలో అధికారులున్నారు. అయితే వాతావరణాన్ని బట్ి ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
తుఫాన్ ముప్పుతో....
తుఫాన్ ముప్పుతో అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. అల్పపీడనం రేపు తుఫాన్ గా బలపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని పండమేరు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు వరదలలో చిక్కుకుపోయారు చిక్కుకున్న వారిని అధికారలు రక్షించగలిగారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Next Story