Tue Apr 01 2025 09:30:55 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : అచ్చెన్నాయుడు Vs విజయసాయిరెడ్డి.. సెటైర్లు అదిరిపోయాయిగా?
మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు

మంత్రి అచ్చెన్నాయుడు వైసీీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి కూడా తమ పార్టీలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. వంద రోజుల్లో 90 రోజుల పాటు ఆయన టీడీపీలో చేరాలని ప్రయత్నించి విఫలమయ్యారని అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ అగ్రనేతల వద్దకు పెద్ద ఎత్తున రాయబేరాలు నడిపారన్న అచ్చెన్నాయుడు కానీ అధినాయకత్వం మాత్రం విజయసాయిరెడ్డి చేరికకు అంగీకరించలేదని అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డి లాంటి వారిని పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటామని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అలాంటి వారికి తమ పార్టీలో ఎప్పుడూ అనుమతి ఉండదని కూడా చెప్పారు. 90 రోజుల పాటు చేరడానికి శ్రమించి కుదరక ఇప్పుడు ట్వీట్లతో విజయసాయిరెడ్డి రెచ్చిపోతున్నారంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
సాయిరెడ్డి కౌంటర్...
అయితే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి... కచ్చి... అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీ లో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా... నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా! భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో...ఆన్...నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా. అంటూ సెటైరికల్ గా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story