Mon Dec 23 2024 11:40:02 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి సురేష్‌కు తప్పిన ప్రమాదం
మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది. విశాఖ బీచ్ లో పారా మోటరింగ్‌కు వెళ్లేందుకు బయలుదేరగా ఈ ఘటన చోటు చేసుకుంది
మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది. విశాఖ బీచ్ లో పారా మోటరింగ్‌కు వెళ్లేందుకు బయలుదేరగా ఇసుకతిన్నెల్లో ఒరిగిపోయింది. దీంతో కొంతసేపు షాక్ అయ్యారు. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
జీ 20 సన్నాహక సదస్సులో...
విశాఖపట్నంలో జీ 20 సన్నాహక సదస్సులో మంత్రులు ఆదిమూలపు సురేష్, విడదల రజని, గుడివాడ అమరనాథ్ తదిరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మారథాన్ సాహస క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పారా మోటరింగ్ ఫస్ట్ వైడ్ రైడ్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story