Fri Nov 22 2024 17:03:53 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లే రాళ్లదాడికి దిగారు ; ఇవిగో ఆధారాలు
యర్రగొండపాలెంలో రాళ్లదాడికి దిగింది టీడీపీ కార్యకర్తలేనని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు
యర్రగొండపాలెంలో రాళ్లదాడికి దిగింది టీడీపీ కార్యకర్తలేనని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న టీడీపీ నేతలు జరిపిన రాళ్ల దాడి వీడియోలను చూపించారు. చంద్రబాబు తన రోడ్‌షోకు, సభకు జనం రాలేదనే ఇలా రాళ్ల దాడికి పాల్పడాలని క్యాడర్‌కు చెప్పారని సురేష్ అన్నారు. తన కార్యాలయంపై దాడికి దిగింది తెలుగుదేశం పార్టీ గూండాలేనని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
జనం లేకనే....
దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యర్రగొండపాలెం వైసీపీకి కంచుకోట వంటిదని చెప్పిన సురేష్ ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలే లేవని తెలిపారు. అందుకే అలజడి సృష్టించడానికి చంద్రబాబు ఇలా రాళ్లదాడిని ప్రోత్సహించారన్నారు. జనం రాకపోవడంతో ఇరుకు సందుల్లోనే చంద్రబాబు సభను పెట్టారన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.
Next Story