Mon Dec 23 2024 09:10:20 GMT+0000 (Coordinated Universal Time)
దావోస్ కు అందుకే వెళ్లలేదు
దావోస్ కు ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆహ్వానం లేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి అమరనాథ్ అన్నారు
దావోస్ కు ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆహ్వానం లేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి అమరనాథ్ అన్నారు. నవంబరు 25నే వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్ నుంచి తమకు ఆహ్వానం అందిందన్నారు. అయితే సదస్సు ఉన్నందునే తాము దావోస్ కు వెళ్లలేదని అమరానధ్ తెలిపారు. ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకే తాము అక్కడకు వెళ్లలేదని తెలిపారు.
ఐదేళ్లు ఏం తెచ్చారు?
చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి దావోస్ కు వెళ్లి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని అమరనాథ్ ప్రశ్నించారు. గోంగూర పప్పు పెట్టామని, రాష్ట్రాలకు పెట్టుబడులు తెస్తామని చెప్పుకుని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఏమేరకు పెట్టుబడులు తెచ్చారంటూ ప్రశ్నించారు. సృష్టికి కారణం తానే అని చంద్రబాబు చెప్పుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టింది తానే అని చెప్పుకుంటూ తిరగడం తప్ప రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదన్నారు గుడివాడ అమర్నాథ్.
Next Story