Fri Dec 27 2024 07:33:08 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : బెయిల్ పై ఏమిటీ టీడీపీ హంగామా?
న్యాయం గెలిచిందని టీడీపీ హంగామా చేయడాన్ని మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు
న్యాయం గెలిచిందని టీడీపీ హంగామా చేయడాన్ని మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. అనారోగ్య కారణాలతోనే ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చిందన్న విషయాన్ని మరచిపోతున్నారన్నారు. కేవలం ఆసుపత్రికి వెళ్లి కంటికి చికిత్స చేయించుకుని తిరిగి నవంబరు 28వ తేదీన జైలుకు సరెండర్ కావాలని ఆదేశించిన సంగతిని విస్మరిస్తున్నారన్నారు. కంటి చికిత్సను సెంట్రల్ జైలులో చేయలేరు కాబట్టి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని అంబటి రాంబాబు అన్నారు.
షరతులు విన్నారా?
న్యాయం గెలిచేది ఎప్పుడు విచారణ జరిగి నిర్దోషిగా బయటపడితేనే న్యాయం గెలుస్తుందని ఆయన అన్నారు. కేవలం ఆరోగ్య రీత్యా మాత్రమే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిందన్నారు. న్యాయం, ధర్మం గెలిచిందంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నాలుగు వారాల తర్వాత మళ్లీ ఆయన జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని అంబటి రాంబాబు టీడీపీ నేతలకు హితవు పలికారు. ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాలని సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Next Story