Sun Dec 22 2024 21:49:02 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కు నాలుగో పెళ్ళాం ఎవరో చెప్పిన అంబటి
తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ కు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు. అతడి దృష్టిలో నాలుగు పెళ్లిళ్లు అంటాడు. మరి ఆ నాలుగో పెళ్లాం ఎవరో తెలీదు.. మరి అది జగనేమో నాకు తెలియదన్నారు. లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే... రా జగన్ రా! అని అన్నారు పవన్.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ అని అన్నారు. జగన్ ను పాతాళానికి తొక్కేస్తానని పవన్ అన్నారని, అది జరగాలంటే పవన్ ను పుట్టించిన వాళ్లు రావాలని అన్నారు. పవన్ గొప్పా లేక జగన్ గొప్పా అనేది జనసైనికులే చెపుతారని అన్నారు. పవన్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన మంచి నటుడని అంబటి అన్నారు. ఆయన రాజకీయాలకు పనికిరారని.. పిచ్చిపిచ్చి సినిమా డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. పవన్ చీప్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని, పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు బాధ కలిగిందని పవన్ అన్నారని, మరి వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు బాధ కలగలేదా అని ప్రశ్నించారు. బాలకృష్ణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని పొగిడారే తప్ప.. జనసేన కార్యకర్తలు ఎదురుచూసినట్లు పవర్ షేరింగ్ గురించి మాత్రం మాట్లాడలేదన్నారు. జనసేన కార్యకర్తలు చెవిలో పూలు పెట్టుకున్నట్టు చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఏది అనుకున్నాడో దాని గురించి నిలబడే నాయకుడు వైఎస్ జగన్ అని… అలాంటిది సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదన్నారు.
Next Story