Sun Dec 22 2024 09:27:56 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : ఇద్దరు కలిసినా చేసేదేమీ లేదు.. చంద్రబాబు, పవన్ పై ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. రా కదిలిరా అన్నా కూడా ఎవరూ కదలి రారని ఆయన ఎద్దేవా చేశారు. పంటల సాగుకకు నీటిని విడుదల చేస్తున్నామన్న అంబటి రాంబాబు మూడు విడతలుగా పదిహేను టీఎంసీల నీటిని విడుదల చేశామని చెప్పారు. చంద్రబాబు బ్రోకర్ రాజకీయాలు చేసి ఎదిగారన్నారు. పిచ్చి వాగుడు వాగితే జనం పట్టించుకోరని ఆయన అన్నారు. స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని చంద్రబాబుకు హితవకు పలికారు.
నోరు అదుపులో పెట్టుకోవాలంటూ...
నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలసినా పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని, అయితే ప్రజలు వారి హామీలను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఒక్కరు కూడా చంద్రబాబును కానీ, పవన్ ను కాని విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అన్నీ తప్పుడు ఆరోపణలు చేసి ఏదో ప్రజలను మభ్య పెట్టాలని భావిస్తే వారే తగిన బుద్ధి చెబుతారని అంబటి రాంబాబు అన్నారు.
Next Story