Sun Dec 22 2024 20:22:54 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికలయ్యాక లోకేష్ టీడీపీ కుర్చీ మడత పెట్టేస్తాడు
ఎన్నికలయ్యాక టీడీపీ కుర్చీని కూడా మడత బెడతాడంటూ మంత్రి అంబటి రాంబాబు అన్నారు
ఎన్నికలయ్యాక టీడీపీ కుర్చీని కూడా మడత బెడతాడంటూ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కుర్చీని మడతపెట్టడంలో లోకేష్ సిద్ధహస్తుడంటూ ఆయన అన్నారు. శంఖం ఊదలేని స్థితిలో శంఖారావం ఉందని అన్నారు. లోకేష్ నాయకత్వాన్ని చూసి నేతలే పారిపోయే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సిద్ధం సభలకు వస్తున్న స్పందనను చూసి టీడీపీ నేతల భ్రమలు తొలిగిపోతున్నాయని అన్నారు. అసెంబ్లీలో సమాధానం చెప్పలేక పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు అని ఆయన ఫైర్ అయ్యారు.
చర్చకు సిద్ధం....
చంద్రబాబుతో చర్చకు వైసీపీ సిద్ధమని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. చంద్రబాబును ముసిలోడు అంటే లోకేష్ కు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయినప్పుడు తన తండ్రి ముసిలోడు అని లోకేష్ అనలేదా? అని ఆయన నిలదీశారు. పవన్ కల్యాణ్ ను ఆటలో అరటి పండు అని ఆయన అన్నారు. కుర్చీలను మడతపెట్టడంలో లోకేష్ ది గిన్నీస్ రికార్డు అంటూ ఫైర్ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే సీటునే మడతపెట్టేశాడంటూ లోకేష్ పై అంబటి రాంబాబు మండి పడ్డారు.
Next Story