Thu Dec 26 2024 05:31:01 GMT+0000 (Coordinated Universal Time)
Ambati : నాలుక మడతబడకుండా చూసుకో.. లోకేష్ కు కౌంటర్
డీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు మంత్రి అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు మంత్రి అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. కుర్చీ మడత పెడతారన్న లోకేష్ డైలాగ్ కు అంబటి స్పందించారు. కుర్చీ మడతం పెట్టడం సరే బాబూ.. ముందు నాలుక మడత కాకుండా చూసుకోమంటూ అంబటి రాంబాబు చురకలంటించారు. ఆయన ఎక్స్ వేదికగా ఈ కామెంట్స్ చేశారు.
కుర్చీలు మడతపెట్టి...
లోకేష్ శంఖారావం సభలో మాట్లాడుతూ ఏపీ ప్రజలు కుర్చీలు మడతబెడతరాంటూ కామెంట్ చేశారు. జగన్ సర్కార్ దిగిపోవడం ఖాయమని ఆయన అన్నారు. అందుకు ధీటుగా అంబటి రాంబాబు నాలుక మడత పడకుండా చూసుకో బాబూ అంటూ లోకేష్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇలా ఏపీలో గుంటూరు కారం సినిమా పాట రాజకీయ నేతల నోట పదే పదే పలుకుతుంది.
Next Story