Sun Dec 22 2024 14:25:24 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : ఎస్ .. నేను సంబరాల రాంబాబునే
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. ఆట పాటలతో అలరించారు
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. ఆట పాటలతో అలరించారు. గతఏడాది తరహాలోనే అంబటి రాంబాబు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. గత ఏడాది అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది. ఆయన ప్రత్యర్థులు అంబటి రాంబాబును సంబరాల రాంబాబుగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో ఆయన ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారా? లేదా? అన్న అనుమానానికి ఆయన తెరదించారు.
ఈ ఏడాది కూడా...
అయితే ఈ ఏడాది కూడా అంబటి రాంబాబు తన సంప్రదాయాన్ని కొనసాగించారు. భోగి మంటల వేడుకలో పాల్గొన్నారు. డ్యాన్సులు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎవరేమి అనుకున్నా తాను సంబరాల రాంబాబునే అని అన్నారు. సంక్రాంతి సమయంలో తాను సంబరాల రాంబాబునని, తర్వాత రాజకీయ రాంబాబునంటూ ఆయన ప్రత్యర్థులకు చురకలంటించారు. తాను దేనికీ భయపడాల్సిన పనిలేదని, తనలో శక్తి ఉన్నంత వరకూ ప్రజలతో కలసి ఆడుతూపాడుతూ గడుపుతానని ఆయన చెప్పారు.
Next Story