Sun Dec 14 2025 23:29:17 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : రాంబాబు.. హోలీ... హంగామా చూశారా?
మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. హోలీ రోజు సత్తెనపల్లిలో డ్యాన్స్ వేశారు

మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. పండగ వస్తే చాలు ఆయన జనం మధ్యలోకి వచ్చి తాను ఒకడిగా మారి డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు సత్తెనపల్లిలో రాంబాబు హడావిడి చూడాల్సిందే. పాటలకు స్టెప్లు వేస్తూ అనుచరులనే కాదు...అందరినీ ఆకట్టుకుంటారు. అందుకే ఆయనను సంబరాల రాంబాబు అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు.
హోలీ పండగ రోజు....
తాజాగా హోలీ పండగ రోజు కూడా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు చేసిన హంగామాతో అందరూ ఖుషీ అయ్యారు. అందరితో కలసి రంగులు జల్లుకుంటూ హోలీని సత్తెనపల్లిలో జనం మధ్యలో జరుపుకున్నారు. అంతేకాదు రంగులు పూయించుకున్న తర్వాత ఆయన బుల్లెట్ పై సత్తెనపల్లిలో తిరుగుతూ క్యాడర్ లో హుషారు పుట్టించారు.
Next Story

