Mon Dec 23 2024 00:06:10 GMT+0000 (Coordinated Universal Time)
నెట్టింట్లో వైరల్ అవుతున్న మంత్రి అంబటి ఫొటోలు
సినిమాలపై ఉన్న మక్కువతో.. అంబటి రాంబాబు గతంలో ఓ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏంటి ?
అమరావతి : ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అంబటి రాంబాబు ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంబటి రాంబాబు అంటే.. ఇప్పటి ప్రజలకు ఒక రాజకీయ నేతగా మాత్రమే తెలుసు. సినిమా వ్యక్తులతో ఆయనకు మంచి పరిచయాలున్నాయని తెలుసు. కానీ ఆయన ఒకానొకప్పుడు సినిమాల్లో నటించారని తెలుసా? ఇప్పుడు అందుకు సంబంధించిన ఫొటోలే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సినిమాలపై ఉన్న మక్కువతో.. అంబటి రాంబాబు గతంలో ఓ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏంటి ? సినిమాలో ఆయన ఏ క్యారెక్టర్ చేశారు? అన్న విషయాలపై క్లారిటీ లేదు. వైరల్ అవుతున్న ఫొటోల్లో ఆయన పక్కనున్న అమ్మాయిని కాస్త దీర్ఘంగా పరిశీలిస్తే.. సీనియర్ నటి, మొగలిరేకులు ఫేమ్ శృతి లాగా కనిపిస్తుంది. అంబటి రాంబాబు పక్కన ఉన్నది ఆమేనా ? వేరే హీరోయినా ? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story