Sat Dec 28 2024 00:47:20 GMT+0000 (Coordinated Universal Time)
పేరు మార్చుకోకుంటే పవన్ భ్రష్టు పడతాడు
తన మీద పవన్ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు
తన మీద పవన్ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెండు లక్షలు లంచం తీసుకున్నానని నిరూపిస్తే రాజీనామా చేస్తానని తెలిపారు. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. వారాహి పేరు మార్చుకోకపోతే పవన్ కల్యాణ్ భ్రష్టు పట్టిపోతారని అంబటి రాంబాబు హెచ్చరించారు. వారాహికి వరాహం అని పేరుపెట్టుకోవాలిన సూచించారు. తనను ప్రశ్నించే ముందు చంద్రబాబును గతంలో పోలవరం పైన ఏనాడైనా ప్రశ్నించావా అని అంబటి రాంబాబు నిలదీశారు. తాను కాదని కాపుల గుండెల్లో పవన్ కుంపటి అని అన్నారు.
కాపు కులాన్ని...
కాపు కులాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నావని పవన్ పై అంబటి ఫైర్ అయ్యారు. కాపులను గాడిదలను చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేస్తారని అన్నారు. కాపులకు శని పవన్ కల్యాణ్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలసి వెళ్లడానికి పవన్ సిద్ధమయ్యాడన్నారు. 2019లో జగన్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన పవన్ ఏం చేశాడని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు విడిపోవడం, కలవడం అలవాటేనని అన్నారు.
Next Story