Mon Dec 23 2024 14:23:32 GMT+0000 (Coordinated Universal Time)
బాబు నివాసం ఎక్కడ? తిరిగేది ఎక్కడ?
400 కోట్లతో కట్టిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని, దీనికి కారణమెవరని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
400 కోట్లతో కట్టిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని, దీనికి కారణమెవరని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ ఎవరైనా కడతారా? అని ఆయన నిలదీశారు. లోయర్ కాఫర్ డ్యాం వరదల్లో మునిగిపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ తప్పిదాల వల్లనే ఈ అనర్థాలన్నీ జరిగాయని అంబటి రాంబాబు తెలిపారు. ఎంత వరద వచ్చినా ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకున్నామని ఆయన చెప్పారు.
పోలవరం విషయంలో....
పోలవరం విషయంలో టీడీపీ చెప్పేవన్నీ అబద్దాలేనని అని ఆయన అన్నారు. జగన్ సర్కార్ వల్లనే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. 2018 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని శాసనసభలో చేసిన ప్రకటన ఏమైందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ లోనే నివాసం లేదని, హైదరాబాద్ లో ఉంటూ కాలక్షేపానికి ఏపీకి వస్తుంటారన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ప్రజలు ఆయన మాయ మాటలను నమ్మరని అంబటి రాంబాబు అన్నారు.
Next Story