Sat Dec 28 2024 01:14:32 GMT+0000 (Coordinated Universal Time)
బానిస బతుకును మార్చుకోండి.. పవన్ కు అంబటి హితవు
వైసీపీ నేతలపై జనసైనికులపై దాడికి పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి రోజాపై హత్యాయత్నంపై జరిగిందన్నారు
వైసీపీ నేతలపై జనసైనికులపై దాడికి పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి రోజాపై హత్యాయత్నంపై జరిగిందన్నారు. విశాఖలో జనవాణి కోసం రాలేదని టీడీపీ వాణిని విన్పించడానికి వచ్చారని ఆయన ఫైర్ అయ్యారు. తమ పై దాడులు చేస్తే మీకు సన్మానాలు చేయాలా అని మంత్రి అంబటి ప్రశ్నించారు. అసాంఘిక శక్తులకు కళ్లెం వేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అసాంఘిక శక్తులకు నాయకత్వం వహిస్తున్న పవన్ కల్యాణ్, చంద్రబాబులను ప్రజలు అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన అన్నారు. ప్రజా గర్జన డేట్ ఫిక్స్ చేసిన తర్వాత జనవాణి ని విశాఖలో ఫిక్స్ చేసుకున్నారన్నారు.
ప్యాకేజీ కోసం...
బానిసగా మారి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నావని పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఏమిటో సైకో చేష్టలు అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో వికేంద్రీకరణను పోటీ పడుతుందని, నోవాటెల్ లో ఉండి జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఆర్థిక సాయం చేస్తారన్నారని ఆయన అన్నారు. జనసేన కాదది బాబు సేన అని పేరు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. జనసైనికులు ఏంటి? శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోదు అని అంబటి రాంబాబు హెచ్చరించారు. బానిస బతుకు మానుకుని ఇకనైనా రాజకీయాలు చేస్తేనే ప్రజలు నమ్ముతారని అంబటి హితవు పలికారు.
Next Story