Mon Dec 23 2024 07:07:55 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ ముందు తెలుగు నేర్చుకో : అంబటి
మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు
మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ విధానం మూడు రాజధానులేనని చెప్పారు. పవన్ కల్యాణ్ రాజకీయ అవగాహనతో విమర్శలు చేయాలన్నారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనమవుతుందని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. తెలుగు రాని లోకేష్ ను టీడీపీ నాయకుడిని చేద్దామని ఆయన తండ్రి కలలు కంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు.
పవన్ వారాహి యాత్ర....
నారా లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయిందన్నారు. లోకేష్ పాదయాత్ర కోసమే పవన్ కల్యాణ్ తన వారాహి బస్సు యాత్రను ఆపారన్న విషయం అందరికీ తెలుసునని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్ సొంతంగా రాజకీయాలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని రాంబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని అంబటి జోస్యం చెప్పారు.
Next Story