Thu Dec 26 2024 17:58:39 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : నల్లత్రాచు కంటే విషం కల్గిన నేత చంద్రబాబు
దేశ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి విషపూరితమైన రాజకీయ నేత ఎవరూ లేరని అంబటి రాంబాబు అన్నారు
దేశ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి విషపూరితమైన రాజకీయ నేత ఎవరూ లేరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు కంటే నల్లత్రాచు బెటర్ అని ఆయన అన్నారు. ఆయన కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సభలకు జనం కరువయ్యారన్నారు. తనది విజన్ అట.. జగన్ పాయిజన్ అట అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను ఫలానా పని చేశానని చేసుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. చంద్రబాబు పాలన అంతా తన వర్గం వారి ప్రయోజనాల కోసమే జరిగిందని రాష్ట్రమంతటా తెలుసునని అంబటి రాంబాబు అన్నారు.
దేనికి సిద్ధమంటే?
జగన్ సిద్ధమంటే.. మేమూ సిద్ధమని అంటున్నారని, ఒకటి మాత్రం నిజం అని ఎన్నికలు పూర్తయిన వెంటనే తట్టాబుట్టా సర్దుకుని చంద్రబాబు, పవన్, లోకేష్ లు హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మేనిఫేస్టోను వెబ్సైట్ నుంచి తొలగించడమే చంద్రబాబు విజన్ అని అన్నారు. పవన్ కల్యాణ్ కూడా సిద్ధమని అంటున్నారని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధమా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన సైన్యం జగన్ పై బురద జల్లే కార్యక్రమం చేస్తుందన్నారు. ప్రజలు జగన్ ను ముఖ్యమంత్రిగా దించడానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని, మధ్యలో దిష్టిబొమ్మల్లా చంద్రబాబు, పవన్ ఉన్నారని అంబటి రాంబాబు అన్నారు.
Next Story