Sun Nov 17 2024 17:32:49 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : పవనూ...ఆ వార్నింగ్లు ఏంటమ్మా
నీటి పంపకాల విషయంలో తాము రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు
నీటి పంపకాల విషయంలో తాము రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ ప్రజలకు నష్టం జరగనివ్వబోమని అన్నారు. ఆయన నాయకత్వంలో నీళ్ల కోసం పోరాడుతున్నామని అంబటి రాంబాబు చెప్పారు. మన వాటాను మనం సాధించుకోవడం తప్పేంటని ఆయన ప్రశనించారు. కృష్ణా జలాల పంపకంలో ఏపీ తీవ్రంగా ఏపీ నష్టపోయిందన్నారు. అందుకు గత చంద్రబాబు ప్రభుత్వమే కారణమని అంబటి రాంబాబు అన్నారు. మా హక్కులను కాపాడుకోవడానికి వెళితే అది దండయాత్ర ఎలా అవుతుందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తెలంగాణ కృష్ణా నీటిని ఎక్కువగా వాడుకుంటుందన్నారు.
రైతు ద్రోహిగా...
చంద్రబాబు రైతుల పాలిట ద్రోహిగా మారాడన్నారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వత్తాసు పలకడంపై ఎద్దేవా చేశారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపే సత్తా లేదన్నారు. చంద్రబాబు దయతలచి ఇరవై ముప్ఫయో సీట్లు ఇస్తే అందులోనూ అభ్యర్థుల కోసం వెదుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీతో కలయికపై జనసైనికులకు వార్నింగ్లు ఇవ్వడమేంటని ఆయన పవన్ ను ప్రశ్నించారు. తనను ప్రేమించే వాళ్ల కన్నా, తన సామాజికవర్గం కన్నా పవన్ కల్యాణ్ కు టీడీపీ నేతలే ఎక్కువయ్యారన్నారు. అందుకోసమే ఆయన తమ కలయికపై ఎవరు ప్రశ్నించినా ఊరుకోబోమని హెచ్చరించారని అంబటి రాంబాబు అన్నారు.
Next Story