Wed Dec 18 2024 22:45:51 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : పవన్ పై అంబటి సెటైర్లు మాములుగా పేలలేదుగా
జనసేన అధనేత టీడీపీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు
జనసేన అధనేత టీడీపీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. నారా లోకేష్ యువగళం ముగింపు సభలో హీరో పాత్ర నుంచి యాంకర్ పాత్రలోకి పవన్ మారిపోయారని ఆయన అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర వల్ల ఆయన ఒళ్లు తగ్గిందే తప్ప, ఎటువంటి ప్రయోజనం లేదని అంబటి రాంబాబు అన్నారు. పాదయాత్రకు జనం కరువైతే అరువు తెచ్చుకున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్ర అలసట లేకుండానే జరిగిందన్నారు.
ముగింపు సభకు...
మూడు పదిహేను వేలు తొంభై వేలు అని చెప్పిన మహా మేధావి లోకేష్ అని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ, పవన్ లు రేపు యాంకర్ అవతారమెత్తుతున్నారన్నారు. జనం ఎక్కువగా వస్తారనే వీరిని ముగింపు సభకు ఆహ్వనిస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రి అయిన లోకేష్ సోదరుడికి, చౌదరికి తేడా తెలియదని సెటైర్ వేశారు. చివరకు యాంకర్ ఉదయ భాను ను తెచ్చి మీటింగ్ లు పెట్టుకోవాల్సిన దుస్థితి ేర్పడిందన్నారు.
Next Story